గోపాల-గోపాల రీమేక్‌లో సుదీప్‌

Sudeep in Gopala Gopala remake

03:44 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Sudeep in Gopala Gopala remake

'ఈగ' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుదీప్‌ నెగిటీవ్‌ పాత్రలో నటించి ఒక చిత్రంతోనే తెలుగులో కావాల్సినంత గుర్తింపు పొందాడు. అయితే సుదీప్‌ కన్నడలో ఒక పెద్ద స్టార్‌ హీరో మాత్రమే కాదు మల్టీ టాలెంట్‌ ఉన్న నటుడు. సుదీప్‌ ఒక నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్‌, స్క్రీన్‌ రైటర్‌ మరియు టీవి ప్రెజెంటర్‌ కూడా. కన్నడలో సుదీప్‌కి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కూడా ఉన్నాయి. రీసెంట్‌గా సుదీప్‌ తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని కన్నడలో రీమేక్‌ చేశాడు. తెలుగులో లానే కన్నడలో కూడా ఇది సూపర్‌హిట్‌ అయింది.

ఇప్పుడు సుదీప్ మరో రీమేక్‌ కి సిద్దమయ్యాడు. 2015 సంక్రాంతికి విడుదలైన 'గోపాల-గోపాల' చిత్రాన్ని రీమేక్‌ చెయ్యాలని సుదీప్‌ భావిస్తున్నాడట. గోపాల-గోపాల లో వెంకటేష్‌ నటించిన పాత్రలో సుదీప్‌ నటిస్తాడట. మరి పవన్‌ కళ్యాణ్‌ పాత్రలో ఎవరు అనుకుంటున్నారా? కన్నడ స్టార్‌హీరో ఉపేంద్ర దేవుడిగా కనిపించనున్నాడని సమాచారం.

English summary

Kannada Super Star Kichcha Sudeep is remaking telugu super hit movie Gopala Gopala. He is acting in Victory Venkatesh role and Upendra is acting in Pawan Kalyan role.