పవన్ వాడిన బైక్ కోసం 8 లక్షలు ఖర్చు పెట్టిన సూపర్ స్టార్

Sudeep Spends 8 Lakhs For Pawan Kalyan Bike

04:18 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Sudeep Spends 8 Lakhs For Pawan Kalyan Bike

ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే చేరువయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కన్నడంలో స్టార్ హీరో స్టాటస్ అనుభవిస్తున్న సుదీప్ మిగతా సౌత్ భాషల్లోనూ నటిస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల్లో నటించడమే కాదు, పలు తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్స్ చేస్తున్నాడు. గతంలో ప్రభాస్ హిట్ మూవీ మిర్చిని మాణిక్య పేరుతో కన్నడలో రీమేక్ చేసి, సూపర్ హిట్ ను అందుకున్న సుదీప్.. ఆ తర్వాత పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది చిత్రాన్ని రన్న పేరుతో రీమేక్ చేసి మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సుదీప్ కు పవన్ కళ్యాణ్ కి చెందిన మరో సినిమాపై కూడా మనసు పడింది. దీంతో రీమేక్ చేస్తున్నాడు.

ఇవి కుడా చదవండి: సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

అదేమంటే, క్రితం సంవత్సరం సంక్రాంతికి వచ్చిన గోపాల-గోపాల సినిమా... పవన్-వెంకటేశ్ కలసి నటించిన ఈ మల్టీస్టారర్ కన్నడలో రీమేక్ చేస్తున్నాడు. పవన్ పోషించిన పాత్ర‌లో నటించేందుకు సుదీప్ ఆసక్తి చూపిస్తుండగా, వెంక‌టేష్ పోషించిన భక్తుడి పాత్ర‌ కోసం ఉపేంద్రను సంప్రదించి ఓకే చేయించుకుని ముకుందా..ముకుందా టైటిల్ తో షూటింగ్ మొదలెట్టాడట ఒకప్పటి హీరోయిన్ ప్రేమను...ఉపేంద్రకు భార్యగా తీసుకోనున్నారు. తెలుగులో శ్రియ ఆ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్...ఓ బైక్ ని వాడారు. సినిమాలో ఎక్కువ భాగం ఆ బైక్ పైనే కనపడతాడు.. ఇప్పుడు అదే బైక్ ని సుదీప్ వాడుతున్నాడు. అందుకే బైక్ తో సీన్స్ కూడా షూట్ చేసేసాడు. ఇక ఈ బైక్ కోసం ఎనిమిది లక్షలు దాకా ఖర్చు పెట్టినట్లు అంటున్నారు. అది కూడా పవన్ ఇక్కడ వాడిన బైక్ నే తీసుకుని వెళ్లినట్లు వినికిడి.

ఇవి కుడా చదవండి:

నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

ఎన్టీఆర్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

English summary

Kannada Super Star Sudeep was acted in Telugu Movies and got good craze. Sudeep was going to remake Pawan Kalyan's Gopala Gopala Movie In Kannada and Sudeep Spends 8 lakhs for Pawan Kalyan Bike.