కాళ్ళు పట్టుకునేంత తప్పు ఏం చేసాడు?

Sudeep Touched Venkatesh Feet

12:40 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Sudeep Touched Venkatesh Feet

తప్పు చేస్తే కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరడం తప్పు కాదు. అయితే ఇక్కడ సుదీప్ అంత తప్పు ఏమి చేసి ఉంటాడా అనేది ప్రశ్న. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టింగ్ లు , ట్వీట్ ల మోజులో దొర్లకూడని తప్పు ఏదైనా జరిగిందా? నిజానికి కన్నడ హీరో అయిన సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. ఇక హీరోగానే కాకుండా దర్శకుడిగా కన్నడ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న సుదీప్ కి తెలుగు, కన్నడ, హిందీ, తమిళ ఫీల్డ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ బానే తెచ్చుకున్నాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో సిసిఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన రసవత్తరమైన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ కేవలం ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ సందర్భంగా వెంకీ కాళ్ళు పట్టుకున్నాడు సుదీప్. ఎందుకంటే,

మ్యాచ్ ముగిసిన అనంతరం తెలుగు వారియర్స్ కెప్టెన్ విక్టరీ వెంకటేష్ కర్ణాటక టీం కు అభినందనలు తెలిపడానికి మైదానంలో అడుగుపెట్టాడు. ఈలోగా తనకి ఎదురుగా వస్తున్న సుదీప్ కి షేక్ హ్యాండ్ ఇవ్వబోగా, సుదీప్ ఒక్కసారిగా వంగి వెంకటేష్ కాలుని తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇక ఈ సీన్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అదండీ కధ.

English summary

Kannada Hero Kicha Sudeep was become famous in Telugu by acting villian in S.S.Rajamouli Eega Movie.During CCL match which was held in Hyderabad Sudeep touches the feet of Hero Victory Venkatesh For Blessings