హీరో సుధీర్‌బాబుని కొట్టిన ఫైటర్‌!!

Sudheer Babu hand injured in fight shooting

06:01 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Sudheer Babu hand injured in fight shooting

సుపర్‌ స్టార్‌ మహేష్‌బాబు బావ అయిన సుధీర్‌బాబు 'ఎస్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. ఆ చిత్రం విజయం సాధించగా ఆ తరువాత 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. సుధీర్‌బాబు ఇప్పడు బాలీవుడ్‌లో కూడా నటిస్తున్నాడు. టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫైటింగ్‌ రిహార్సల్స్‌ చేస్తుండగా ఫైటర్‌ విసిరిన పంచ్లో సుధీర్‌ చేతికి గాయమైంది. ఆ విషయాన్ని తనే స్వయంగా ఫేసుబుక్‌లో పోస్ట్‌ చేశాడు.

'బాఘీ' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాబిర్‌ఖాన్‌ దర్శకత్వం వహించగా సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు తెలుగులో హీరోగా నటించిన 'భలేమంచిరోజు' ఆడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.

English summary

Sudheer Babu hand injured in fight shooting. It is a hindi movie called Bhaghi.