హీరో సుధీర్ బాబుకు కలిసొచ్చిన సింధు.. ఎలాగో తెలుసా?

Sudheer Babu is acting in Pullela Gopichand biopic movie

11:49 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Sudheer Babu is acting in Pullela Gopichand biopic movie

అదేమిటి? రియోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం గెలిస్తే, టాలీవుడ్ హీరో సుధీర్ కి కల్సి రావడం ఏంటబ్బా అనుకుంటున్నారా? అవును నిజం సుధీర్ కి బాగా కలిసొస్తుందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. సింధు గురువు పుల్లెల గోపిచంద్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ నిర్మించాలని సుధీర్ బాబు తలచాడు. ఎందుకంటే ఒకప్పుడు సుధీర్, గోపీచంద్ కలిసి బ్యాడ్మింటన్ ఆడారు కూడా. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించాలనుకున్నాడు. అయితే, ఈ సినిమాలో ఎక్కువగా గోపీచంద్ కష్టాల గురించే ఎక్కువగా ప్రస్తావించాలనుకున్న రచయితకు క్లైమాక్స్ విషయంలో ఏం చేయాలో అర్థం కావడంలేదట.

దీంతో స్ర్కిప్టు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడిందట. ఇప్పుడు పీవీ సింధు రజతం సాధించడంతో దేశవ్యాప్తంగా గోపీచంద్ పేరు సైతం మార్మోగిపోతోంది. ఈ అంశాన్నే క్లైమాక్స్ గా మలచాలని ఈ చిత్ర రచయిత ఆలోచిస్తున్నాడని టాక్. ఈ ఊపులోనే సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని సుధీర్ భావిస్తున్నట్లు ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు. సింధు రజతం.. సుధీర్ కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మొత్తానికి ఓ విధంగా సినిమా తీద్దామంటే మరోవిధంగా ముగుస్తోంది.

English summary

Sudheer Babu is acting in Pullela Gopichand biopic movie.