విలన్ పాత్రలకు సై

Sudheer Babu Ready For Villain Roles

11:38 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Sudheer Babu Ready For Villain Roles

పెద్ద హీరోలు అవకాశాలు సన్నగిల్లితే, తమ పంధా మార్చుకుని , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చాన్స్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు యువ హీరోల దృక్పథం కూడా మారింది. ‘కథంతా నా చుట్టూనే తిరగాలి’ అని గిరి గీసుకొని కూర్చోవడం లేదు. అవసరమైతే కీలక పాత్రలు చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. ‘ఎస్‌.ఎం.ఎస్‌’తో కథానాయకుడిగా పరిచయయిన సుధీర్‌బాబు కూడా ప్రస్తుతం ఆ మాటే చెబుతున్నాడు. ‘ప్రేమకథా చిత్రమ్‌’తో విజయాన్ని అందుకొన్న ఇతగాడు ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘బాఘీ’లో విలన్ గా అవతారం ఎత్తి ఆకట్టుకొన్నారు. ఈ విజయం రుచి చూసిన సుదీర్ తెలుగులోనూ అలాంటి పాత్రలు పోషించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటున్నాడు.

ఇవి కూడా చదవండి: అతన్ని చూసి పారిపోయిన హీరోయిన్

హైదరాబాద్‌లో సుధీర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ‘‘బాఘీలో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అవకాశాలూ వస్తున్నాయి. తెలుగులోనూ విలన్‌గా నటించడానికి నేను సిద్ధమే’’ అని ప్రకటించాడు. త్వరలోనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో సుధీర్‌ హీరోగా నటించబోతున్నాడు.‘‘నేను బాడ్మింటన్‌ క్రీడాకారుణ్న . కాబట్టి గోపీచంద్‌ పాత్రలో నటించడం నాకు సులభమే. పైగా పుల్లెల గోపీచంద్‌ జీవితాన్ని దగ్గర్నుంచి చూశా. ఆయన వ్యక్తిత్వం, జీవిత ప్రయాణం బాగా తెలుసు. ‘భలే మంచి రోజు’కు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీరాంరెడ్డి ఓ కథ చెప్పారు. అది బాగా నచ్చింది. త్వరలోనే దాన్ని సెట్స్‌పైకి వెళ్తాం' అన్నాడు సుదీర్. మొత్తానికి మరో విలన్ ఇండస్ట్రీకి దొరికాడు.

ఇవి కూడా చదవండి: పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి: వైద్య శాస్త్రంలో అద్భుతం - చని పోయిన బిడ్డ బతికాడు

English summary

Tollywood Young Hero Sudheer babu says that he was ready to do Villain roles in Telugu Movies also. Recently he acted as Villain in "Bhagi" movie in Bollywood. He said that He is going to act in the life history of Badminton Coach Pullela Gopi Chand.