సుడిగాలి సుధీర్ ఓ 'ఇంటి' వాడయ్యాడు

Sudigali Sudheer owned a new house

12:51 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Sudigali Sudheer owned a new house

ఈమధ్య నటీనటులు బానే సెటిల్ అవుతున్నారు. ముఖ్యంగా గ్రేట్ వన్ ప్రోగ్రామ్ గా దూసుకుపోతున్న బుల్లితెర జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో నటిస్తున్న వాళ్ళు కూడా బాగా సెటిల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులను నవ్విస్తున్న సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పటివరకు అద్దె ఇంట్లో గడిపిన సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లు కొన్నాడు. తన టాలెంట్ ను గుర్తించి అవకాశం కల్పించిన మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు సుధీర్. అదే విధంగా తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

జబర్ధస్త్ యాంకర్ రష్మీతో ప్రేమాయణం అంటూ మొన్నటివరకు వార్తల్లో నిలిచిన సుధీర్.. ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుధీర్ తో లవ్ ఎఫైర్ పై బాగా రాయండి అంటూ ఇటీవల రష్మీ కాస్త వెరైటీగా స్పందించడం గమనార్హం.

English summary

Sudigali Sudheer owned a new house