అలీ నోటి దురుసుపై సుహాసిని సీరియస్!

Suhasini fire on Ali comments

10:46 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Suhasini fire on Ali comments

టాలీవుడ్ కమెడియన్ అలీ నోటి నుంచి అనేక సందర్భాల్లో వచ్చిన వెకిలిమాటలు అతనికి చాలా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అయినా యాంకరింగ్ సమయం లో ఆలీ రెచ్చిపోవడం మామూలే అయింది. చిన్నా పెద్దా లేకుండా అందునా హీరోయిన్లు, యాంకర్లను ఉద్దేశించి అలీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా దుమారాన్నే రేపాయి. పలువురు మహిళలు, యువతులు అలీ కామెంట్లకు వీడియోల రూపంలో తమ నిరసన వెలిబుచ్చారు. తాజాగా అలీ చేసిన కామెంట్లకు సీనియర్ నటి సుహాసిని అసహనం వ్యక్తం చేసినట్లు టాక్.

సింగపూర్ లో జరిగిన సైమా అవార్డుల కార్యక్రమంలో ఆడవాళ్లపై అలీ చేసిన కామెంట్లు సుహాసినికి ఆగ్రహం రప్పించాయట. దయచేసి ఇంకెప్పుడూ ఆడవాళ్లను, చిన్నపిల్లలను అవమానించేలా జోక్స్ మాత్రం వేయకండని అలీకి సుహాసిని క్లాస్ పీకారట. కార్యక్రమం తర్వాత అలీ ఈ విషయమై సుహాసినికి వివరణ ఇవ్వబోతూంటే ఇలాంటివి రిపీట్ కావద్దని సున్నితంగా మందలించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆలీపై సుహాసిని హెచ్చరిక జ్ఞానోదయం కలిగించినా అని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Ali was anchoring at SIIMA 2016 awards in Singapore. In this award function as usual resorted to his adult jokes. Suhasini fire on Ali comments.