పవర్ స్టార్ పేరు నిహారికకు పచ్చబొట్టు అయిందా?

Suicide victim Niharika about Pawan Kalyan

10:53 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Suicide victim Niharika about Pawan Kalyan

అవునా అంటే అవుననే అంటున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని అయిన మండలి నిహారిక తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంది. ఇంతకీ అలా ఎందుకు చేసిందంటే, వివరాల్లోకి వెళ్ళాలి. పవన్ పేరును ఆమె పచ్చబొట్టుగా పొడిపించుకునేంత అభిమానానికి గల కారణాన్ని నిహారిక వివరించింది. 20 ఏళ్ల వయస్సప్పుడు తన తల్లిదండ్రులు నాకు బలవంతపు పెళ్లి చేశారు. కొన్నాళ్లకే భర్త నిజస్వరూపం బయటపడింది. దీంతో భర్త పెట్టే హింసలు తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా..

అయితే, సగం కాలిన గాయాలతో బతికిబయటపడ్డా. ఆ తర్వాత తన లాంటి వారికి తాను ఇప్పుడు అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నా. నేను ఇంతిలా ఉండడానికి పవన్ కల్యాణ్ స్ఫూర్తి అంటూ వివరించింది.

English summary

Suicide victim Niharika about Pawan Kalyan