68 వేల కోట్లకు యాపిల్ పై దావా

Suit on Apple company for 68 thousand crores

12:41 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Suit on Apple company for 68 thousand crores

తన టెక్నాలజీనీ కాపీ కొట్టిందంటూ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ యాపిల్పై ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి కోర్టులో దావా వేసాడు. ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్..1992లో తాను రూపొందించిన ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్(ఈ ఆర్ డీ) టెక్నాలజీని యాపిల్ కాపీ కొట్టిందంటూ ఆ సంస్థపై సుమారు 68 వేల కోట్ల రూపాయలు దావా వేశాడు. నవలలు, వ్యాసాలు చదువుకోవడానికి, ఫోటోలు బ్రౌజింగ్ కు, వీడియోలు చూసేందుకు తాను ఈ డివైస్ ను రూపొందించానని, ఈ డివైస్ పేటెంట్ కోసం 1992లో అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్నానని అతడు వివరించాడు.

అయితే, రాస్ దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించిందని అంటున్నారు. యాపిల్ పై దావా గెలిస్తే, రాస్ కు 68వేల కోట్ల రూపాయలతో పాటు ఏడాదికి 23 వేల కోట్ల డాలర్లు యాపిల్ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ కేసు ఏమౌతుందో చూడాలి.

English summary

Suit on Apple company for 68 thousand crores