సుజనాకు కాలం కల్సి రావడం లేదట!

Sujana Chowdary To Get Out From Central Ministy

01:25 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Sujana Chowdary To Get Out From Central Ministy

కొద్దికాలంగా టీడీపీ యువనేతతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఈసారి రాజ్యసభ సభ్యత్వం పొడిగింపు కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగింపు విషయంలో చంద్రబాబు ఆసక్తి చూపకుండా వస్తున్నారు. అయితే.. ఏమైందో ఏమోకానీ, మొత్తానికి చంద్రబాబు మనసు మారిందట. సుజనాకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారట. అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలోనూ ఆయన్నే కొనసాగించాలని భావిస్తున్నారట. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. బాబు దయదలచినా, సుజనా దురదృష్టం ఏమో కానీ ప్రధాని మోడీ మొండిపట్టు మొదలైందని అంటున్నారు. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సుజనాను తప్పించబోతున్నట్లు చంద్రబాబుకు మోడీ ఇప్పటికే సంకేతాలిచ్చారట. దీంతో కేంద్రమంత్రివర్గంలో సుజనాని కొనసాగించాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారట.

ఇవి కూడా చదవండి:భార్య అక్ర‌మ సంబంధాన్ని టెక్నాల‌జీతో బయట పెట్టాడు

బ్యాంకుల నుంచి ఆర్ధిక అభియోగాలను ఎదుర్కొంటున్న సుజనాను మంత్రివర్గంలో కొనసాగించడం వల్ల ఏన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అప్రతిష్టపాలు కావాల్సి వస్తుందని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తానికి కేంద్ర మంత్రివర్గంలోకి సుజనా చౌదరిని తీసుకునేందుకు మొదట్లోనే ప్రధాని తీవ్రంగా విముఖత ప్రదర్శిచినట్లు బీజేపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పటికే వివిధ ఆర్ధికాభియోగాలను ఎదుర్కొంటున్న సుజనాను మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సివస్తుందని మోడీ చెప్పినప్పటికీ, చంద్రబాబు పట్టుబట్టి సుజనాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరడంతో - భాగస్వామ్య పార్టీ అధినేత మాట కాదనలేక మోడీ మంత్రివర్గంలో - సుజనాకు స్థానం కల్పించారట. అయితే మంత్రివర్గంలో చేరిన తరువాత కూడా సుజనాపై ఆర్ధికాభియోగాలు రెట్టింపు కావడంతో త్వరలోనే జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ని తప్పించాలని మోడీ భావిస్తున్నారంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సుజనాను మంత్రివర్గంలో కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారని కమలనాథులు అంటున్నారు. సుజనాను మంత్రివర్గంలో కొనసాగించే విధంగా ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి తన పంతం నెగ్గించుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారట.

ఇవి కూడా చదవండి:చిరంజీవి అందులో బెస్ట్ ... పైగా మంచోడు

ఇక సుజనా విషయంలో టీడీపీ సీనియర్ల కూడా అసంతృఫ్తిగానే ఉన్నారు. సుజనాను కొనసాగించాల్సిందేనని అధినేత పట్టుబట్టడం టీడీపీలోని సీనియర్లకు సైతం నచ్చడం లేదు. సుజనా పార్టీకి చేసిన సేవలేమిటో తమకైతే అర్ధం కావడం లేదని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సేవ చేసిన వారేందరో సీనియర్లు ఉండగా పట్టుబట్టి ఆయనకే కేంద్రమంత్రి పదవి ఇప్పించిన చంద్రబాబు ప్రస్తుతం ఆర్ధికాభియోగాలు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా కొనసాగించాలని కోరడం అర్ధరహితమని ప్రైవేట్ సంభాషణాల్లో పేర్కొంటున్నారు. వచ్చేనెలతో రాజ్యసభ పదవి కాలం ముగియననున్న సుజనాను కేంద్రమంత్రివర్గం నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సుజనాకు ఇబ్బందులు తప్పేట్టు లేదు.

ఇవి కూడా చదవండి:కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

ఇవి కూడా చదవండి:17 ఏళ్లుగా మేడలో వున్న బులెట్ తొలగింపు

English summary

TDP Senior Leader and Union Minister of State for Science & Technology and Earth Sciences, Government of India Y.Sujana Chowdary was presently in a money laundering case and Modi Government was planning to remove him from Ministry but Nara Chandra Babu Naidu was Supporting Y.Sujana Chowdary.