నా సినిమా నాకే నచ్చలేదు: సుకుమార్

Sukumar don't likes Nannaku Prematho

02:56 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Sukumar don't likes Nannaku Prematho

సుకుమార్‌ దర్శత్వంలో ఎన్‌టీఆర్ హీరోగా నటించిన సినిమా 'నాన్నకుప్రేమతో'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా సుకుమార్‌ కి మాత్రం నచ్చలేదట. 'నాన్నకుప్రేమతో' సినిమాని ఇంకా బాగా తీద్దామనుకున్నాడట సుకుమార్‌. కానీ సంక్రాంతి రేస్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చెయ్యాలని ఎన్‌టీఆర్ సుకుమార్‌ ని తొందర పెట్టాడట. దీంతో కావలసినంత సమయం లేకపోవడంతో ఎడిటింగ్‌ లో నాణ్యత తగ్గిందని సుకుమార్‌ ఫీలయినట్టు సమాచారం. అంతేకాకుండా డైరెక్టర్‌ కంటే రైటర్‌గా ఉంటేనే బాగుంటుందని కూడా ఫీలయ్యాడట.

సినిమా హిట్‌ అయినప్పటికీ సుకుమార్‌ ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో అందరూ ఆశ్చర్య పడుతున్నారు. అయితే సుకుమార్‌ డైరెక్షన్‌ నుంచి భయటకు రావడానికి సిధ్ధపడుతున్నాడు. అందుకే ఈ విధమైన కామెంట్లు చేస్తున్నాడని కొందరు అంటున్నారు.

English summary

Creative director Sukumar don't likes Nannaku Prematho movie. Because he want to take this movie with very clarity but to release this movie for Sankranthi he didnot edit the movie well.