డైరెక్షన్‌ కి గుడ్‌బై చెప్పిన సుకుమార్‌!!

Sukumar said good bye to direction

04:35 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Sukumar said good bye to direction

రీసెంట్‌గా రెండు బ్యాక్‌టుబ్యాక్‌ హిట్స్‌ అందుకున్న మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్ ఇంకో రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్‌ చేసి డైరెక్షన్‌ ని వదిలిపెట్టనున్నాడు. ఈ విషయం ఒక ఇంటర్‌వ్యూ లో సుకుమార్‌ తెలియజేసాడు. అయితే ఈ ఇంటర్‌వ్యూ ఇంకా పబ్లిష్‌ అవ్వలేదు. అతను ఏ సందర్భంలో రిటైర్మెంట్ ను ప్రకటించాడో ఇంకా తెలీదు. టాలీవుడ్‌లో ఉన్న చాలా కొద్దిమంది టాలెంటెడ్‌ దర్శకులలో సుకుమార్‌ ఒకడు. అయితే రెండు బ్యాక్‌టుబ్యాక్‌ హిట్స్‌ అందుకున్న తరుణంలో రిటైర్మెంట్‌ ప్రకటించడం వల్ల చాలా మంది సినిమా లవర్స్‌ కనఫ్యూజ్‌ అవుతున్నారు. సుకుమార్‌ అభిమానులు కూడా చాలా విషాదంలో ఉన్నారు.

సుకుమార్‌ తెరకెక్కించిన నాన్నకుప్రేమతో, తన స్వంత బ్యానర్‌ పై తీసిన కుమారి 21ఎఫ్‌ లతో సూపర్ హిట్స్‌ అందుకున్నాడు. సుకుమార్‌ రిటైర్మెంట్‌ తరువాత ప్రొడ్యూసర్‌గా మరియు రచయితగా తన స్వంత బ్యానర్‌లోనే పని చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

English summary

Sukumar said good bye to direction. Sukumar said in a latest interview after directing 2 more movies he want to quit from direction.