సుకుమార్‌ నెక్స్ట్‌ టైటిల్‌

Sukumar upcoming movie title

04:56 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Sukumar upcoming movie title

కుమారి 21ఎఫ్‌, నాన్నకు ప్రేమతో వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు సుకుమార్‌. నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్‌ని మొదటిసారి 50 కోట్ల క్లబ్‌లోకి సుకుమారే చేర్చాడు. ఇప్పటికి నాన్నకు ప్రేమతో 54 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు సుకుమార్‌ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రం సుకుమార్‌ దర్శకత్వం వహించడు. కుమారి 21ఎఫ్‌ చిత్రానికి కథ, నిర్మాణం ఎలా అందించారో అలానే ఈ చిత్రానికి కథ అందించి నిర్మిస్తాడు. ఈ చిత్రానికి 'దర్శకుడు' అనే టైటిల్‌ ని సుకుమార్‌ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడట. అయితే ఈ చిత్రానికి కుమారి ని తెరకెక్కించిన దర్శకుడు కాకుండా మరో కొత్త డైరెక్టర్‌ తో తెరకెక్కించనున్నాడు సుకుమార్‌. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్‌.

English summary

Creative director Sukumar upcoming movie title was registered as a 'Darshakudu'. Sukumar will provide story and produce this movie. This movie will direct by new director.