సుమను ఎంటర్టైన్మెంట్ మినిస్టర్ చేస్తా!

Suma AV video in Zee telugu Apsara awards 2016

12:28 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Suma AV video in Zee telugu Apsara awards 2016

కేరళ నుంచి వచ్చి తెలుగులో ఎంతో అద్భుతంగా మాట్లాడే సుమ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ యాంకర్. బుల్లి తెర ప్రేక్షకుల నుండి సినీ ప్రేక్షకుల వరకు యాంకర్ సుమ అంటే తెలియనివారుండరు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో ప్రోగ్రామ్స్ కు సుమ ప్రచారకర్తగా పని చేస్తుంది. అయితే ఇటీవల జరిగిన ‘జీ తెలుగు’ అప్సర అవార్డ్స్ కార్యక్రమంలో 'ఎంటర్‌టైనర్ ఆఫ్ ద టెలివిజన్‌' గా సుమకు అవార్డోచ్చింది. టాలీవుడ్ నుండి వచ్చిన అతిరధ మహారధులు విజయనిర్మల, జమున, కృష్ణంరాజు, జయప్రద, ఛార్మి, ప్రగ్య జైస్వాల్, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, సునీత, అనసూయ, లావణ్య త్రిపాఠి అందరి సమక్షంలో అవార్డు అందచేసారు.

ఈ సందర్భంగా సుమ గురించి భారతదేశంలో రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు నరేంద్రమోడీ, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోనీ సుమ గురించి మాట్లాడినట్లు చక్కగా డబ్బింగ్ చేసారు. ఈ వీడియో చుసిన అందరూ పొట్టలు చెక్కలయ్యేలాగ నవ్వారు. పెద్ద పెద్ద స్టార్ లు సైతం ఈ వీడియో చూసి పొట్ట చెక్కలయ్యేలాగ నవ్వారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియో ని చూసి నవ్వేయండి.


English summary

Suma AV video in Zee telugu Apsara awards 2016. Indian Prime Minister Narendra Modi, Indian Cricket team Captain Mahendra Singh Dhoni, Bollywood Big B Amitabh Bachchan talks about anchor Suma in Zee telugu Apsara awards 2016.