సుమ కి ఏమైంది..?

Suma Clarifies The Rumors On Her Health

02:51 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Suma Clarifies The Rumors On Her Health

ప్రస్తుతం తెలుగు లో ఉన్న యాంకర్లలో టాప్ యాంకర్ ఎవరని ఎవరినైనా అడిగితే టక్కున చెప్పే ఒకే ఒక పేరు సుమ. సుమ అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. సుమ కి ఉన్నంత క్రేజ్ వేరే ఏ ఇతర యాంకర్ కు లేదనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇతర యాంకర్ల సైతం తమ ఫేవరేట్ యాంకర్ ఎవరిని అడిగితే చెప్పే మాట ఒక్కటే సుమ. ఇలా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సుమ. ఇటు టీవీ షో ల దగ్గర నుండి అటు ఆడియో ఫంక్షన్లు , సినిమా ఫంక్షన్ల వరకు సుమ అన్నింటిలోను తనదైన శైలిలో రాణిస్తుంది. తన చలాకీ తనం , టాలెంట్ తో మెస్మరైజ్ చేసి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న సుమ పై ఇటీవల ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది.

ఇటీవల జరిగిన కొన్ని ఫంక్షన్లలో సుమ ఇంతకు ముందు ఉన్నంత చలాకీగా కనిపించకపోవడంతో సుమ ఆరోగ్యం బాగోలేదని , సుమ గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతుందని , తన గొంతు బాగోలేకపోవడం వల్ల ఒక వైద్యుడిని కుడా సుమ సంప్రదించినట్టు వార్తలోచ్చాయి. పైగా బాల ఎస్పీ.సుబ్రహ్మణ్యం సూచన మేరకు సుమ వైద్యుడిని కలిసిందని వార్తలు వచ్చాయి . ఇలా తన పై వార్తలు వచ్చిన నేపధ్యంలో సుమ స్పందించింది.

సుమ మాట్లాడుతూ.. "ఫ్రెండ్స్.. నేను బాగానే ఉన్నాను.. నా ఆరోగ్య పరిస్థితి అంతర బాగానే ఉంది...నా పై వచ్చిన తప్పుడు వార్తలను నమ్మ వద్దు .. "అంటూ సుమ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తన ఆరోగ్య పరిస్థితి పై వచ్చిన రూమర్లను కొట్టి పారేసింది. దీంతో ఫ్యాన్స్ సుమ ఎప్పటికి బాగుండాలి అంటూ కామెంట్లు చేసారు.

Friends.., I'm all good..nothing serious about my health condition. Do not believe in false news doing rounds..

Posted by Suma Kanakala on Friday, 11 March 2016

English summary

Recently Rumors came on Top anchor Suma that she was suffering from Throat Problem and thats the reason that she was not anchoring as before.Suma opposes this words and posted in her facebook that She was fine and don't believe rumors in hr.