ఇలా అయితే మా పరిస్థితేంటంటున్నసుమ

Suma Jokes At Rashi Khanna Supreme Audio Launch

05:12 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Suma Jokes At Rashi Khanna Supreme Audio Launch

తెలుగు లో ఉన్న యాంకర్లలో టాప్ యాంకర్ ఎవరని ఎవరినైనా అడిగితే టక్కున చెప్పే ఒకే ఒక పేరు సుమ. యాంకర్ సుమ అంటే ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు .సుమ అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. సుమ కి ఉన్నంత క్రేజ్ వేరే ఏ ఇతర యాంకర్ కు లేదనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇతర యాంకర్ల సైతం తమ ఫేవరేట్ యాంకర్ ఎవరిని అడిగితే చెప్పే మాట ఒక్కటే సుమ. ఇలా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సుమ. ఇటు టీవీ షో ల దగ్గర నుండి అటు ఆడియో ఫంక్షన్లు , సినిమా ఫంక్షన్ల వరకు సుమ అన్నింటిలోను తనదైన శైలిలో రాణిస్తుంది. తన చలాకీ తనం , టాలెంట్ తో మెస్మరైజ్ చేసి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది సుమ. కేరళ రాష్ట్రం నుండి వచ్చిన సుమ మన తెలుగు భాషలో తన మధురమైన మాటలతో టాప్ యాంకర్ స్థానాన్ని సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి:అతి పొడవైన రైలు వంతెనలు

ఎప్పుడు చలాకి గా ఉండే సుమ "ఇలా అయితే మా యాంకర్ల పరిస్థతి ఏంటి అని ప్రశ్నించింది . ఇటీవల జరిగిన సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' ఆడియో విడుదల ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన సుమ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది . సుప్రీమ్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రాశి ఖన్నా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంటే సుమ "ఎలా రాశి? ఎలా? నువ్వు.. తమన్నా.. ఇలా మీరందరూ తెలుగులో చక్కగా మాట్లాడేస్తే.. మా యాంకర్ల పరిస్థితి ఏంటి అని ? మీరే యాంకరింగులు కూడా చేసేస్తారా " అని జోక్ చేసింది . రాశి ఖన్నా సుమ పక్కన నిలుచున్నప్పుడు కుడా నువ్వు "నా ప్రక్కన నిలబడకు , నీ అందం చూస్తే నాది మేకప్ అని తెలిసిపోతోంది" అని జోకులు పేల్చి నవ్వులు పూయించింది సుమ.

ఇవి కూడా చదవండి:

ప్రతీ ఏడాది 'శ్రీరామ నవమి' ముందు రోజు వర్షం.. ఎక్కడో తెలుసా?

రూపాయి నాణెం పైన సింబల్ మీనింగ్ తెలుసా ?

పేరు మార్చుకుని అడల్ట్ సినిమా లో నటిస్తుంది

English summary

Telugu Top Anchor Suma Played some funny Jokes at Heroine Rashi Khanna in Supreme Audio Launch. She says that Heroines like Tamanna and Rashi Khanna were talking Telugu well.