ఆ కోరిక ఇంకా తీరలేదు..

Sumalatha About Her Movie Entry

03:20 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Sumalatha About Her Movie Entry

అందం, అందుకు తగ్గ అభినయంతో కథానాయికగా అలరించిన సుమలత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. స్మూత్ నెస్ గల ఈమె కన్నడ ఇండస్ట్రీలో అగ్రెసివ్‌గా పేరున్న అంబరీష్‌ను పెళ్లాడారు. అలనాటి అగ్రహీరోలందరితో నటించారు. తన అభిమాన హీరోని చూద్దామన్న సాకుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుమలత చివరకు అభిమాన హీరోతో కల్సి నటించలేకపోయారు. ఆ వెలితి ఆమెలో అలానే ఉండిపోయింది. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఈమె ఆదివారం ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలు వెల్లడించారు.

"పదిహేనేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చా. గుంటూరులో పదో తరగతి చదివేటప్పుడు ఓ బ్యూటీ కాంటెస్ట్‌ జరిగింది. నన్ను పార్టిసిపేట్‌ చేయమని బలవంతం చేస్తే, కుదరదన్నా. దీంతో నా ఫ్రెండ్స్‌ మా ఇంటికి వచ్చి అమ్మను కాకా పట్టారు. అమ్మ ఒకే చెప్పేసింది. తొలిసారి చాలా కష్టపడి చీర కట్టించుకున్నా. బ్యూటీ కాంటెస్ట్‌ ప్లేస్‌కు వెళ్లాక, ఒక కార్డు చేతిలో పెట్టారు. నేను స్టేజ్‌పైకి వెళ్లి ఇటు నుంచి అటు సైడ్‌కు చాలా ఇబ్బందిగా చీరతో నడిచా. అలా నడిచి స్టేజ్‌ కిందకు దిగాక ‘నంబర్‌ ఫోర్‌’ అని అనౌన్స్‌ చేశారు. ఎవరని వెనక్కి చూశాను. నా నంబర్‌ ‘ఫోర్‌ ’అని తెలీనంత మూడ్‌లో ఉన్నా. నన్ను పేరుతో పిలిచారు. జమున గారు వచ్చి కిరీటం తలపై పెట్టి, ‘మంచి స్టేజ్‌కు వెళ్తావు’ అని ఆశీర్వదించారు. ఆ రోజుల్లో ‘వనిత’ అనే మ్యాగజైన్‌ కవర్‌పేజీపై నా ఫొటో వేశారు. మా బంధువులకు తెలిసిన వ్యక్తి, నిర్మాత రామానాయుడుగారు కవర్‌పేజీపై నా ఫొటోను చూసి ‘సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉంటే ఎంకరేజ్‌ చేస్తాం’ అని ఓ లెటర్‌ పంపించారు. దాంతో మా ఫ్యామిలీ మెంబర్స్‌ ‘నువ్వేదో కలెక్టర్‌ అవుతావనుకుంటే.. సినిమాలు అవసరమా’ అన్నారు. మా అమ్మ కూడా భయపడింది. ‘పదోతరగతి హాలిడేస్లో ఓ సినిమా చెయ్యు. బాగా లేకపోతే ఆ తర్వాత సినిమాలు వదిలేసి చదుకోవచ్చు కదా’ అని కొందరు నన్ను ఎంకరేజ్‌ చేశారు. ఇక నా అభిమాన నటుడు కమల్‌హాసన్‌ చూడటం కోసం అయినా, ఓ సినిమా అయినా చేయాలని అనుకున్నా. అలా పదిహేను సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చా. అయితే కమల్ హాసన్ తో ఓసారి డేట్స్‌ క్లాష్‌ వల్ల నటించలేకపోయా. ఆ తర్వాత బ్యాడ్‌లక్‌ ఏంటంటే కమల్‌హాసన్‌ గారితో ఓ సినిమాలో ఒప్పుకున్నా, ఓపాట కూడా షూట్‌ చేశారు. ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పట్లో ఉన్న హీరోల్లో కమల్‌గారితో మాత్రమే నేను యాక్ట్‌ చేయలేదు. ఎవరితో నటించాలని కోరుకున్నానో అది జరగలేదు (నవ్వులు). ఆయనతో నటించలేదనే వెలితి మాత్రం ఉంది. ఏదో రోజు కమల్‌తో నటిస్తాననే ఆశ ఉంది.

English summary

Veteran Heroine Sumalatha says about her film entry during an Tv Chasnnel interview.She says that when she was in 10th standard she participated in a fashion show with her friends pressure and stood at first place in that fashion show.Actress Sumalatha also said that Producer Ramanaidu selected her to act in his movie also starring Superstar Krishna and Sridevi.She says that she was the big fan of Kamal Hassan and thats the main reason that she came into films but she did not acted in a single movie with kamal Hassan.