అక్కినేని కుటుంబంలోకి సుమలత రాలేదు - సమంత వస్తోంది

Sumalatha Disclosed Secret About Nagarjuna

12:10 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Sumalatha Disclosed Secret About Nagarjuna

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని ... జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని..' అంటూ ఓ సినీ కవి రాస్తే , ఆపాటకు అభినయం చేసింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. సరిగ్గా ఆపాటకు తగ్గట్టుగా అక్కినేని వారింట జరుగుతోంది. టాలీవుడ్ దిగ్గజాల్లో మొదటగా వినిపించే రెండు పేర్లలోఒకటి ఎన్ టి ఆర్, రెండు అక్కినేని నాగేశ్వరరావు ... ఇందులో అక్కినేని హీరోయిన్స్ పై జోకులు వేయడం ఆయన ఎక్కువగా చేసేవారు.
అలాంటి ఏఎన్నార్.. తన కుమారుడు హీరో కాకముందే ఓ హీరోయిన్ ని కోడలిగా అనుకున్నారట. మాజీ హీరోయిన్ సుమలత ఒక నాటి కబుర్లను ఈనాటి ఆడియన్స్ తో పంచుకుంది. ''ఓసారి నాగేశ్వరరావు గారు నన్ను పెళ్లి గురించి అసలు ఉద్దేశ్యం ఏంటి అని అడిగారు. ఓ అమెరికా రిటర్న్ అబ్బాయిని చేసుకుంటావా అన్నారాయన. అవసరమైతే మా అమ్మతో కూడా మాట్లాడతానన్నారు. మా అమ్మతో కూడా మాట్లాడాను నేను. తరువాత ఆయన్ను ఇంతకీ ఎవరు సార్ ఆ అబ్బాయి అంటే.. తన చిన్న కొడుకు నాగార్జున కోసమే అలా అడిగానని చెప్పారు'' అంటూ సుమలత వివరించింది. అంటే నాగార్జున ఇంకా సినిమాల్లో నటించడం ప్రారంబించకముందే ఈ విషయం చోటుచేసుకందనమాట.
ఇదంతా బానే ఉంది కాని.. మరి ఏఎన్నార్ ప్రపోజల్ కి తానిచ్చిన జవాబు ఏంటో మాత్రం సుమలత చెప్పలేదు. ఈ లెక్కన ఏఎన్నార్ తన కోడలిగా ఓ హీరోయిన్ అయిన సుమలతను ఎంచుకుంటే.. తర్వాతి కాలంలో మరో హీరోయిన్ అమలను నాగార్జున ఎంచుకున్నాడు. ఈ కధ పక్కన పెడితే, ఆతరంలో అక్కినేని కుటుంబంలోకి సుమలత రాలేదు గానీ, ఈ తరంలో అక్కినేని కుటుంబంలోకి ఇంచుమించు ఆపేరుకు దగ్గరగా వున్న సమంత వస్తోంది. నాగార్జున తనయుడు నాగ చైతన్యతో సమంత లవ్ ఎఫైర్ విషయం తెల్సిందే. త్వరలో పెళ్ళిపీటల కు వీరి యవ్వారం చేరబోతోంది. అదండీ సుమలత అవుట్ , సమంత ఇన్ కధ.

ఇది కూడా చూడండి: చేతి మణికట్టుపై ఇలాంటి రేఖలు ఉంటే, ఏం జరుగుతుందో తెలుసా

ఇది కూడా చూడండి: పవన్ బర్త్ డేకి జూనియర్ గిఫ్ట్

ఇది కూడా చూడండి: పిల్లాడి చెవిలో ఏమైంది(వీడియో)

English summary

Sumalatha Disclosed Secret About Nagarjuna.