బాలయ్యకు మద్దతు పలికిన సుమన్..

Suman Supports Balakrishna Comments On Woman

10:43 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Suman Supports Balakrishna Comments On Woman

సావిత్రి ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలకు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెబుతూ, తనకు మహిళలంటే గౌరవం ఉందన్నారు. తన సినిమాల్లో మహిళలను అగౌరవపరిచే విధంగా సీన్లు ఉండవని తేల్చి చెప్పారు. ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదనీ.. కొంతమంది దీనిపై రాద్దాంతం చేశారని విమర్శించారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణకు నటుడు సుమన్ మద్దతుగా నిలిచాడు. బాలకృష్ణ క్షమాపణ చెప్పినా, ఆయన వ్యాఖ్యలపై రాజకీయం చేయడం సరికాదని సుమన్ అన్నారు. విశాఖలో సుమన్ మాట్లాడుతూ,'బాలయ్య అలా ఎందుకన్నారో నాకు తెలియదు. కానీ క్షమాపణ చెప్పక కూడా రాజకీయం చేయడం తగదు' అని పేర్కొన్నాడు. బాలకృష్ణ ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా, మర్యాదగా ఉంటారన్నారు.

English summary

Veteran hero Suman Supports Hero and Politician Bala Krsihna on the Comments that Balayya made on Woman.Suman says that Balkrishna was very funny in the set and he Says that even though balayya said Sorry some politicians were making this issue bigger.