సుమంత్ సైలెంట్ వెనుక కసి దాగి ఉందట..

Sumanth acting in Vicky Donor remake

11:37 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Sumanth acting in Vicky Donor remake

మొదట్లో హిట్స్ కొట్టినా ఆతర్వాత, ఏమో గుర్రం ఎగరావచ్చు వరకూ వరుస ఫ్లాప్స్ ఇచ్చిన సుమంత్, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి హిందీలో హిట్టైన విక్కీ డోనర్ ని తెలుగులో తనే నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో టీవీ నటి, హిందీ మహాభారతం ఫేం పల్లవి సుభాష్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. హిందీలో అన్నూ కపూర్ చేసిన కధను మలుపు తిప్పే పాత్రను తనికెళ్ళ భరణి చేస్తున్నారు. ఇప్పటికే ఎటువంటి పబ్లిసిటీ లేకుండా టాకీ మొత్తం పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని సుమంత్ కసిగా వున్నాడట. గతంలో ఫ్లాప్స్ లో వున్న కళ్యాణ్ రామ్ తనే నిర్మించిన అతనొక్కడేతో హిట్ కొట్టినట్టు ఈ సినిమాతో సుమంత్ కూడా హిట్ కొడతాడో లేదో చూడాలి. అయినా తెలుగు ఇండస్ట్రీలో హిట్, ఫట్ సహజమే. గతంలో అగ్ర హీరోలకే ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు కదా. అందుకే సుమంత్ కి మంచి రోజులు వస్తాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

English summary

Sumanth acting in Vicky Donor remake