సుమంత్ అశ్విన్ రైట్ రైట్ సినిమా ఫస్ట్ లుక్

Sumanth Ashwins Right Right Movie Poster Launched

06:59 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Sumanth Ashwins Right Right Movie Poster Launched

యంగ్ హీరో దర్శకుడు యం.స్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ అప్ కమింగ్ మూవీ రైట్ రైట్ .. దీపావళి పండగ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. మలయాళంలో సూపర్ హిట్ అయిన " ఆర్డినరీ " అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ బస్ కండక్టర్ పాత్రలో కనిపించనుండగా బాహుబలి లో కాలకేయ పాత్రతో ప్రపంచ గుర్తింపు తెచుకున్న నటుడు ప్రభాకర్ బస్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

తన ముందు చిత్రం కేరింతతో మంచి దూకుడు మీదున్న సుమంత్ అశ్విన్ ఈ చిత్రం పై ఆశలు పెట్టుకున్నాడు . వచ్చే వేసవికి ఈ చిత్రం విడుదలవుతుందని తెలిపారు.

English summary

Sumanth Ashwins Right Right Movie Poster Launched