భానుడి ప్రతాపానికి గుండు పగిలింది..

Sun heat breaks big stone in Nellore

11:48 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Sun heat breaks big stone in Nellore

భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తెలో కాసే ఎండలకు రోళ్లు పగులుతాయని అంటారు కదా. అక్షరాల దీన్ని నిజం చేస్తూ నెల్లూరు జిల్లాలో ఓ ఘటన జరిగింది. సూర్యుడి ప్రతాపానికి రోళ్లే కాదు ఏకంగా పెద్ద కంకుల గుండే ముక్కలైంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, మర్రిపాడు, ఉదయగిరి, అనంతసాగరం ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల ప్రభావానికి అనంతసాగరం మండలం ముస్తాపురంలో దశాబ్ధాల నాటి కంకులు గుండు(నూర్పిడికి ఉపయోగిస్తారు) ఎండలకు పగుళ్లిచ్చి నిలువునా చీలిపోయింది. ఇంకా ఎండలు ఎంత దారుణంగా ఉంటాయోనని జనం భయపడుతున్నారు.

English summary

Sun heat breaks big stone in Nellore