సరికొత్త రికార్డు గూగుల్  పిచాయ్‌ సొంతం

Sundar Pichai Gets Stock Grant of $199 Million

06:58 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Sundar Pichai Gets Stock Grant of $199 Million

భారతీయుడు గూగుల్‌ సంస్థకు సీఈఓ కావడమే కాదు ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అదేమంటే, సుందర్‌ పిచాయ్‌ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఘనత ఈయనది.భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ 2015 ఆగస్టులో గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న ఈయనకు తక్కువ కాలంలోనే తానేమిటో నిరూపించుకున్నారు. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. ఫలితంగా అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ చేరిపోయారు. కొత్తగా వచ్చిన షేర్లతో అల్ఫాబెట్‌లో ఆయన షేర్ల విలువ సుమారు 650 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4,430 కోట్లు)చేరింది. అల్ఫాబెట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్‌ పోరట్‌కు కూడా 38.3 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ లభించాయి. ఇప్పుడు పిచాయ్ కి పలువురు టెక్ లతో పాటు ప్రముఖులు కూడా అభినందనలు అందిస్తున్నారు.

English summary

Google CEO Indian Sundar Pichai received a grant for 273,328 Class C Google stock units, worth about $199 million (roughly Rs. 1,356 crores), according to a regulatory filing by Google parent company Alphabet Inc.