భారత్‌ లో గూగుల్‌ సీఈఓ పర్యటన

Sundar Pichai Tour On India

12:42 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Sundar Pichai Tour On India

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ గూగుల్‌ సీఈఓ సుందరపిచాయ్‌ ఈ రోజు భారత్‌కు వచ్చారు . గూగుల్‌ సంస్థకు సీఈఓ గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా సుందరపిచాయ్‌ భారత్‌కు వచ్చారు . భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సుందరపిచాయ్‌ భారతప్రధాని నరేంద్రమోడి, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లతో సమావేశం కానున్నారు. సుందరపిచాయ్‌ చెన్నైకి చెందిన వారు. ఈయన ఐఐటీ ఖరగ్ పూర్‌లో విద్యాభ్యాసం చేశారు.

సుందరపిచాయ్‌ భారత పర్యటనలో భాగంగా గూగుల్‌, ఇండియన్‌ రైల్వే వారితో కలిసి ఉచిత వైపై కేంద్రాలను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పిచాయ్‌ పర్యటనలో గూగుల్‌ సంస్థ ఇండియాలో చేపట్టబోయే భవిష్యత్‌ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆయన తొలుత గూగుల్‌ ఢిల్లీ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి అరుణ్‌ జైట్లీ, సమాచార శాఖామంత్రులతో భేటి అవుతారు.

ఆ తరువాత గురువారం ప్రధాని నరేంద్రమోడీలో సమావేశం కానున్నారు. నరేంద్రమోడి తో భేటి అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స విద్యార్దులతో సరదాగా ముచ్చటించనున్నారు.

English summary

Google CEO Sundar Pichai to visit India Today. He is going to meet Narendra modi and peranabh Mukherjee