నక్షత్రం లో సందీప్ తలకు గాయం

Sundeep Kishan injured in Nakshatram movie sets

12:55 PM ON 16th June, 2016 By Mirchi Vilas

Sundeep Kishan injured in Nakshatram movie sets

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న నక్షత్రం లో హీరోగా నటిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ కి దెబ్బలు తగిలాయట. ఈ సినిమా మంగళవారం సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో జరుగుతుండగా హీరో సందీప్ కిషన్ తలకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఫస్ట్ రోజే ఓ ఫైట్ సీన్ తో షూటింగ్ ప్రారంభించగా పోరాట సన్నివేశంలో భాగంగా సందీప్ కిషన్ తలకు బలమైన గాయం తగిలిందని అంటున్నారు. దీంతో.. చిత్రయూనిట్ హుటాహుటిన సందీప్ ని హాస్పటల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సందీప్ కిషన్ కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

ఇక సందీప్-నిత్యామీనన్ నటించిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మంగళవారం సందీప్ తన అభిమాన డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తాను నటిస్తుండడం తనకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. మరి సందీప్ కి ఇలా గాయాలవ్వడం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary

Sundeep Kishan injured in Nakshatram movie sets