సందీప్ చేతికి వినాయక్ అపార్ట్ మెంట్

Sundeep Kishan Purchases Vv vinayak House

09:55 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Sundeep Kishan Purchases Vv vinayak House

ఆది, ఠాగూర్ , దిల్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ ఆపార్ట్ మెంట్ ఉన్నట్టుండి ‘ప్రస్థానం’ చిత్రంతో 2009లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయకుడు ‘సందీప్‌ కిషన్‌’ చేతికి వచ్చేసింది. అసలు ఇది ఎలా జరిగిందని తెలుసుకోవాలనుందా. అయితే వెంటనే సందీప్కు చిన్నతనం నుంచీ మూడు కోర్కెలు ఉండేవట. అవి ఏమిటంటే, అందరూ కావాలనుకునేవే! అదేనండీ సొంత ఇల్లు, స్పోర్ట్స్‌ కారు, హోం థియేటర్‌. సందీప్ కోరికలలో ఇంటిని ఇటీవల కొనేసాడు. మాదాపూర్‌లోని నాలుగు పడక గదుల ఇల్లును కొన్నట్లు సందీప్‌ చెబుతున్నాడు. తన అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్గంచెరువు కనబడుతుందని, అన్ని సౌకర్యాలు బావున్నాయని తెగ సంబర పడిపోతున్నాడు. ఇంతకీ ఈ అపార్ట్‌మెంట్‌ ఎవరిదో కాదు. ఆయన మామయ్యదేనట. సందీప్‌ తన చిన్నతనంలోనే ఈ ఇంటిని కొంటానని తన మామయ్యతో అనేవాడట. తరువాత ఆయన మామయ్య దర్శకుడు వి.వి. వినాయక్‌కు అపార్ట్‌మెంట్‌ను అమ్మేశారు. దాదాపు ఏడేళ్లుగా దాచుకున్న డబ్బుతో సందీప్‌ కొద్ది నెలల క్రితం వినాయక్‌ దగ్గర నుంచి అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు తెలిపారు. ఇదేదో సినిమా కధలా వుంది కదా , మామయ్యా అమ్మేసిన అపార్ట్ మెంట్ ని మళ్ళీ సొంతం చేసుకున్నాడు సందీప్ .

English summary

Tollywood Young hero Sundeep Kishan Purchases V.V.Vinayak's house which was in Madhapur in Hyderabad.By purchasing this four bed room house in Madhapur Sundeep Kishan felt happy .