మెగాస్టార్ లా ముద్దు పెట్టుకోవాలనిపించింది

Sundeep Kishan Remembers Indra By His Tweet

04:53 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Sundeep Kishan Remembers Indra By His Tweet

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటి నుండి తనదైన నటన , టాలెంట్ తో ముందుకు దూసుకుపోతున్నాడు .వెంకాటాద్రి ఎక్స్ ప్రెస్ , టైగర్ , బీరువా వంటి హిట్లను అందుకున్న సందీప్ కిషన్ తాజాగా తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా అందరిని ఆకట్టుకున్నాడు.

సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న ఒక సినిమా కోసం నే పాటు విదేశాలలో గడిపి , గత శనివారం నాడు హైదరాబాద్ చేరుకున్నాడు . హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే సందీప్ కిషన్ మెగా స్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం "ఇంద్ర" సినిమాలోని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు.

"నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న తరువాత హైదరాబాద్ కి చేరుకున్నాను.. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఇంద్ర సినిమాలో చిరంజీవి లాగా నేలను ముద్దాడాలనిపించింది.. లవ్ యు మై హైదరాబాద్..మిస్ యూ " అంటూ ట్వీట్ చేసాడు. మెగాస్టార్ కెరీర్ లో అద్బుతమైన సినిమాలలో ఒకటైన ఇంద్ర సినిమాను మల్లి గుర్తు చేశావంటూ కొందరు , ఎక్కడికి వెళ్ళినా ఇంటికి చేరుకోవడం ఒక గొప్ప అనుభూతి అంటూ మరికొందరు రిట్వీట్లు చేసారు. మొత్తానికి చిరు ఇంద్ర సినిమాను గుర్తు చేసి ప్రేక్షకుల నుండి మంచి మార్కులే కొట్టేసాడు .

తాజాగా అనిల్ వెన్నల కంటి దర్శకత్వంలో సందీప్ కిషన్ , అనీషా అంబ్రోస్ జంటగా "రన్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుండగా , గత శనివారం రన్ చిత్రం ఆడియో విడుదలైంది . తమిళంలో సూపర్ హిట్ అయిన "నేరం" అనే సినిమాకు ఈ చిత్రం రీమేక్.

English summary

Young Hero Sundeep Kishan was famous for his way of acting and his movies.Recently he attracted all the movie lovers by his tweet .He tweeted that when landed in Hyderabad after one month shooting in foreign he wants to kiss land like Chiranjeevi in Indra Movie.