సందీప్‌ కిషన్‌కి షార్ట్‌ టెంపర్‌ అట

Sundeep Kishan To Act As Police Officer

03:36 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Sundeep Kishan To Act As Police Officer

'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం తరువాత సందీప్‌ కిషన్‌ తరువాత నటించబోయే చిత్రం గురించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. అదేంటంటే సందీప్‌ కిషన్‌ ఇందులో షార్ట్‌ టెంపర్‌ తో కూడిన పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సి.వి. కుమార్‌ ఒకేసారి తెరకెక్కిస్తూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. సందీప్‌ కిషన్‌ గతంలో పోలీస్‌ గా నటించిన 'డి కె బోస్‌' చిత్రం విడుదల కాలేదు. మరోసారి సందీప్‌ పోలీస్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో డానియల్‌ బాలాజీ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

English summary

Young hero Sundeep Kishan was presently acting in Aa Ammayi thappa movie under the direction of C.V.Kumar.In this movie Sundeep Kishan was acted as Police officer.