కుర్ర హీరోకు 12 కుట్లు పడ్డాయి!

Suneep Kishan got 12 stitches

12:10 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Suneep Kishan got 12 stitches

మంచి కసితో పని చేస్తున్న కుర్ర హీరోల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ సందీప్ కిషన్ తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం తనలో స్టామినా కానీ క్రేజ్ గానీ తగ్గలేదని నిరూపించడం కోసం.. నానా తంటాలు పడుతున్నాడు. వరుసగా సినిమాలు ఫెయిల్ కావడంతో.. నెక్ట్స్ పిక్చర్ కోసం యాక్సిడెంట్స్ ని కూడా ఏ మాత్రం కేర్ చేయడం లేదు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్న సందీప్ కిషన్ హిట్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకోడానికైనా రెడీ అంటున్నాడు. అందుకే ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఓ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెల్సిందే. దీంతో ఈ కుర్ర హీరోకి 12 కుట్లు పడ్డాయ్.

అది కూడా తలపైనే కావడం గమనార్హం. అయినా సరే.. ప్రస్తుతం బానే ఉన్నానని అంటున్నాడు. ఆ సమయంలో కెమేరా నా భుజానికి చాలా క్లోజ్ గా ఉంది. కరెక్ట్ గా నా తలకు తగలడంతో పెద్దదెబ్బే తగిలింది. రక్తం చాలా కారిపోవడంతో భయపడ్డా కూడా. మొత్తం యూనిట్ అంతా షాక్ తినేసి.. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అని సందీప్ కిషన్ అంటున్నాడు. వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా.. మూడ్రోజులు చాలంటూ సోమవారం షూటింగ్ కి వెళ్లిపోతానని సందీప్ కిషన్ అంటున్నాడు. త్వరగా కోలుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.

English summary

Suneep Kishan got 12 stitches