'జక్కన్న'గా సునీల్‌?

Sunil as Jakkanna?

03:14 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Sunil as Jakkanna?

సైడ్‌ డ్యాన్సర్‌ నుండి టాప్‌ కమెడియన్‌గా ఎదిగి ఆ తరువాత స్టార్‌ హీరోగా ఎదిగి అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించాడు సునీల్‌. అయితే ఆ తరువాత సునీల్‌ నటించిన మిస్టర్ పెళ్ళికొడుకు ఫ్లాప్‌ అవ్వడంతో సినిమాలు చెయ్యడంలో వేగం తగ్గించాడు సునీల్‌. 2014లో రిలీజైన భీమవరం బుల్లోడు చిత్రం తరువాత మళ్లీ ఇప్పటి వరకు సునీల్‌ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే సునీల్‌ తాజాగా నటించిన చిత్రం 'కృష్ణాష్టమి' షూటింగ్‌ ఎప్పుడో పూర్తయినా కొన్ని అవాంతరాల నడుమ ఈ నెల ఆఖర్లో విడుదలవుతుంది.

అయితే ఇప్పుడు సునీల్‌ వేగం పెంచాడు ఇటీవలే వంశీకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సునీల్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఇటీవలే వైజాగ్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ముందు 'అగ్గిపుల్ల', 'సైనికుడు' అనే టైటిల్స్‌ను పరిశీలించగా తాజాగా 'జక్కన్న' అనే టైటిల్‌ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఒక మంచి పగడ్బందీ స్క్రిప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సునీల్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. దీనితో పాటు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను తన నెక్ట్స్‌ సినిమా కోసం లైన్లో పెట్టినట్లు సమాచారం.

English summary

Sunil as Jakkanna? Sunil is acting in new movie. First this movie titles is discussed as Aggipulla and Sainikudu now it is discussing as Jakkanna.