సునీల్‌ 'ఈడు గోల్డ్‌ ఎహే' ఫస్ట్ లుక్!

Sunil Eedu Goldehe first look

05:51 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Sunil Eedu Goldehe first look

సైడ్‌ డ్యాన్సర్‌ నుండి కమీడియన్‌గా, కమీడియన్‌ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సునీల్‌ దాదాపు సంవత్సరంనర గ్యాప్‌ తరువాత నటించిన చిత్రం 'కృష్ణాష్టమి'. సునీల్‌ నటించిన మిర్. పెళ్లికొడుకు ఫ్లాప్‌ కావడంతో చాలా గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'కృష్ణాష్టమి' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి లో విడుదల కానుంది. ఇది రిలీజ్‌ కాకుండానే వంశీకృష్ణ ఆకెళ్ళ డైరెక్షన్‌లో నటించడానికి అంగీకరించిన సునీల్‌ మరో చిత్రానికి కూడా సిద్ధమయ్యాడు.

బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి చిత్రాలు తెరకెక్కించిన వీరూ పోట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం టైటిల్తో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా వీరూపోట్ల కొద్దిసేపటి క్రితమే విడుదల చేశాడు. 'ఈడుగోల్డ్‌ ఎహే' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్ట్తెన్మెంట్స్‌ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

English summary

Sunil Eedu Goldehe first look. This movie is directing by Veeru Potla.