సినిమాలను వదులుకుంటున్న సునీల్‌

Sunil New Movie Details

06:39 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Sunil New Movie Details

కమెడియన్‌ గా సినిమాల్లోకి వచ్చి అందరినీ మెప్పించిన సునీల్‌ తరువాత ఫుల్‌ లెంగ్త్ హీరోగా మారిపోయాడు. కానీ కామెడియన్‌గా సక్సెస్‌ అయిన సునీల్‌ హీరోగా మాత్రం అనుకున్నంత రేంజ్ సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. హీరోగా రాణించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న సునీల్‌ కు తన అనుకున్న స్థాయిలో సినిమాలు హిట్‌ కావడం లేదు. దీంతో తన నటిస్తున్న ప్రతి సినిమాను ఎంతో ఆలోచించి ఒప్పుకుంటున్నాడు సునీల్‌ . తాజాగా "కృష్ణాష్టమి" పేరుతో ఒక సినిమాను చేస్తున్నాడు సునీల్‌. నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌ లో దర్శకుడు వాసువర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కృష్ణాష్టమి తరువాత రైటర్‌ గోపిమోహన్‌ ను దర్శకునిగా పరిచయం చేస్తూ సునీల్‌ ఒక సినిమా చెయాల్సివుంది. అయితే సునీల్‌ తన ఇతర ప్రాజెక్ట్‌లలో బిజీ అయిపోడంతో గోపిమోహన్‌ సునీల్‌ కాదని వేరే హీరోలతో సినిమాను తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఇటీవల నానీ నటించిన సూపర్‌హిట్‌ అయిన 'భలేభలేమగాడివోయ్‌' చిత్రం మొదట మారుతి సునీల్‌ ను చేయమని కలిసారట . చాలారోజులు ఎదురుచూసిన మారుతికి సునీల్‌ నుండి స్పష్టత రాకపోవడంతో ఈ చిత్రం గీతా ఆర్ట్స్‌ వద్దకు చేరుకుని నానికు చిక్కింది . ఇలా సూపర్‌ హిట్‌ చిత్రాన్ని వదులుకున్న సునీల్‌ ఈ సారైనా అలాంటి తప్పు చేయకుండా ఉంటాడా అని అంతా అనుకుంటున్నారు.

English summary

Hero cum comedian Sunil news movie krshnastami is getting ready to release on this december. Sunil has loosing his movies by his busy schdule. Recently Sunil missed the movie bale bale magadivoy,first maruthi asked sunil for that movie but sunil not responded ..soo the story went to nani and it became huge hit