''సునీల్‌ గోల్డ్‌ ఎహే''

Sunil New Movie First Look

01:08 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Sunil New Movie First Look

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌ ఎంటరయ్యి అందరిని నవ్వించి ఆ తరువాత ఫుల్‌లెంగ్త్ హీరోగా మారిన సునీల్‌ తాను హీరోగా నటించిన అందాల రాముడు, పూలరంగడు, మార్యాదరామన్న , భీమవరం బుల్లోడు, మిస్టర్‌ పెళ్ళికొడుకు వంటి సినిమాలతో అందరిని నవ్వులతో మరిపించిన సునీల్‌ మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఎ.కె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మాత రామబ్రహ్మం సుంకర, దర్శకుడు వీరుపోట్ల కాంబినేషన్లో 'ఈడు గోల్డ్‌ ఎహే' అనే టైటిల్‌తో సునీల్‌ హీరోగా ఒక చిత్రం మొదలుకానుంది. ఎ.కె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మాత రామబ్రహ్మం సుంకర, దర్శకుడు వీరుపోట్ల కాంబినేషన్లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన బిందాస్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో సునీల్‌ హీరోగా రానున్న 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపోందుతుందని, ఈ చిత్రం తాలుకు విషయాలను అతి త్వరలోనే తెలియజేస్తామని ఆ చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర అన్నారు.

వాసు వర్మ దర్శకత్వం లో సునీల్‌ హీరో గా నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి ఈ సినిమా ఈ నెల 18న రీలీజ్‌ చెయ్యనున్నారు.

English summary

Hero sunil confirmed his next movie. He is going to be work with director veeru potla under the production of A.K.Entertainments. This movie was names as "Edu Super Yahay" and the first look of that movie was released