'సునీల్‌' వైజాగ్‌ షెడ్యూల్ పూర్తి!

Sunil news movie first schedule completed in Vizag

11:25 AM ON 19th December, 2015 By Mirchi Vilas

Sunil news movie first schedule completed in Vizag

కమీడయన్‌ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా ప్రమోషన్‌ పొందిన నటుడు సునీల్‌. ఆర్‌పీఏ క్రియేషన్స్‌ పతాకంలో వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇంకా టైటిల్‌ ఖరారు కానీ ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ వైజాగ్‌ లో 35 రోజులు పాటు షూటింగ్‌ జరుపుకుంది. ఈ షూటింగ్‌లో హీరో హీరోయిన్‌ పై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించడంతో పాటు కమీడియన్‌ సప్తగిరి, హీరోయిన్‌ మన్నరా చోప్రా పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. వీటితో పాటు జిల్‌ ఫేమ్‌ కబీర్‌-సునీల్‌ పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

నెక్స్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌ లో జరపనున్నారు. 'ప్రేమ కథా చిత్రానికి' నిర్మాతగా వ్యవహరించిన ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దినేష్‌ సంగీతం అందిస్తున్నాడు.

English summary

Sunil news movie first schedule completed in Vizag. This movie is directing by Vamshi Krishna Akella. Mannara Chopra is romancing with Sunil in this film.