చిరంజీవి 150వ సినిమాలో ఇప్పుడు ఐతే చెయ్యలేనన్న సునీల్!

Sunil rejected to act in Chiranjeevi 150th film

04:12 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Sunil rejected to act in Chiranjeevi 150th film

దాదాపు 8 సంవత్సరాలు తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ చిత్రం కత్తిలాంటోడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లలో నిర్మాత చరణ్, దర్శకుడు వి.వి. వినాయక్ ఫుల్ బిజీగా ఉన్నారట. అయితే ఈ సినిమాలో చిరంజీవికి స్నేహితుడి పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్రకి సునీల్ అయితేనే కరెక్ట్ అనుకుని కొన్ని రోజుల క్రితం సునీల్ ని సంప్రదిస్తే ఆనందంతో ఒప్పేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చిరు సినిమాకి సునీల్ నో చెప్పాడన్న వార్త హల్ చల్ చేస్తుంది. ఈ వార్త విన్న వారందరూ సునీల్ ముందు ఒప్పుకుని మళ్ళీ ఇలా నో చెప్పడమేంటి? అని అనుకుంటున్నారు.

విషయం ఏమిటంటే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళాలి కాని కొన్ని అనివార్య కారణాలు వాళ్ళ పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. తీరా మొదలయ్యే సమయానికి అప్పుడు డేట్లు ఇచ్చిన నటులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితి సునీల్ ఒక్కడికే కాదు మరి కొంతమంది నటులుకు కూడా వచ్చింది. ఇప్పుడు వారు డేట్లు అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారట. అయితే అప్పట్లో సునీల్ దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం మూడు సినిమాలు చేస్తుండడం వల్ల సునీల్ దగ్గర ఈ చిత్రానికి సరిపడే డేట్స్ లేవట అందుకే చిరు సినిమాకి నో చెప్పి తన సినిమాలు చేసుకుంటున్నాడట.

అయితే ఇప్పుడు సునీల్ ప్లేస్ లో ఎవరైతే బాగుంటుందని అనుకుంటుండగా వెన్నెల కిషోర్ అయితే ఈ పాత్ర కి సూట్ అవతాడని భావించిన యూనిట్ వెన్నెల కిషోర్ ను ఈ పాత్ర కు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇలా ఒకటి తరవాత ఒకటిగా 150వ సినిమాకి అడ్దంకులు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలౌతుందో అని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు.

English summary

Sunil rejected to act in Chiranjeevi 150th film