వర్మని కట్‌ చేసాడు

Sunil Removes Varma Name On His Facebook Page

11:14 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Sunil Removes Varma Name On His Facebook Page

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంటరయ్యి అందాలరాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్‌ అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటి టాప్‌ దర్శకులతో పనిచేసి సూపర్‌ హిట్లనందుకున్నాడు.

అయితే ఇటీవల సునీల్‌, వర్మని తీసిపారేసాడు. వర్మతో సినిమా చెయ్యడమంటేనే హీరోలు అదృష్టంగా భావిస్తారు. అలాంటి వర్మని కట్‌ చెయ్యడమేంటని అనుకుంటున్నారా..! సునీల్‌ కట్‌ చేసింది రామ్‌గోపాల్‌ వర్మని కాదు తన పేరులోని వర్మని. సునీల్‌ వర్మ అనే పేరుతో సునీల్‌ తన ఫేస్‌బుక్‌ ఫ్యాన్‌పేజ్‌ను ఎప్పటి నుండో మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. అయితే ఇటీవల సునీల్‌ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లోని పేరు చివర ఉన్న 'వర్మ' అనే పేరును తొలగించాడు. ఇప్పుడు ఇది సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్లలో హాట్‌టాపిక్‌గా మారింది.

English summary

Comedian who became hero Sunil Varma has maintaining his Facebook page from long time,recently he removes Varma name From his facebook page,Now this was trending in Social networking Sites