టీవీ9 యాంకర్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన సునీల్(వీడియో)

Sunil serious warning to tv9 anchor Jaffar

12:25 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Sunil serious warning to tv9 anchor Jaffar

తాజాగా 'జక్కన్న' సినిమాతో ముందుకు వచ్చిన సునీల్ ఓ టీవీ యాంకర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా చంపేస్తా మిమ్మల్ని అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ సరదాకి కాదు, సీరియస్ గానే ఇచ్చాడు. అయితే అంత సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? అసలు ఏమైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే.. టీవీ-9 యాంకర్ జాఫర్ నోటి దూలతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రోజాను బ్లూ ఫిల్మ్ లో నటించారా అని అడిగినా, ఆనం ఎఫైర్ల గురించి అడిగినా, చింతమనేనిని రౌడీ అని అన్నా.. అది జాఫర్ కే చెల్లింది.

అటు వైపు ఎలాంటి వ్యక్తి ఉన్నా ఘాటైన ప్రశ్నలతో వాళ్లకు బీపీ తెప్పిస్తుంటాడు. ఏపీ ప్రభుత్వ విఫ్ చింతమనేని అయితే జాఫర్ ప్రశ్నలు వేస్తుంటే సర్రున లేచి మనోడిని కొట్టినంత పనిచేశాడు. చేయి కూడా పుచ్చుకుని బయటకు తీసుకెళ్లబోయాడు. తాజాగా జాఫర్ కమెడియన్ కం హీరో సునీల్ కు బీపీ రేజ్ చేసి మనోడికి కోపం తెప్పించాడు. జాఫర్ అడిగిన ప్రశ్నలకు సునీల్ కు కోపం సర్రున లేచింది. దీంతో సునీల్ చంపేస్తాను నిన్ను అని జాఫర్ కు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది. ఇంతకు జాఫర్ సునీల్ ను ఏమని అడిగాడో తెలుసా? మీరు ఎప్పుడైనా అద్దం ముందు నుంచొని మీ పర్సనాలిటీ హీరోగా పని చేస్తుందని అనుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు సునీల్ కు ఎక్కడో కాలిపోయింది.

వెంటనే జాఫర్ ను చంపేస్తా మిమ్మల్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేయి చూపిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. త్వరలోనే టీవీ-9లో ప్రసారం కాబోయే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి. మీకే తెలుస్తుంది.

English summary

Sunil serious warning to tv9 anchor Jaffar