మళ్లి కమెడియన్ గా సునీల్

Sunil To Act As Comedian In Chiranjeevi 150th Film

06:40 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Sunil To Act As Comedian In Chiranjeevi 150th Film

కమెడియన్ గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యి , ఆ తరువాత ఫుల్ లెంగ్త్ హీరో మారిపోయాడు సునీల్ . తన నటనతో ఇప్పటికే చాలామంది అభిమానులను సంపాదించుకున్న సునీల్ తనదైన శైలిలో తెలుగు సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటి టాప్‌ దర్శకులతో పనిచేసి సూపర్‌ హిట్లనందుకున్నాడు. అయితే ఇప్పటికి సునీల్‌ కమీడియన్‌ గా చేస్తే చూడాలని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే సునీల్‌ చెప్పే డైలాగులు,సునీల్‌ ఇచ్చే హావాభావాలు ,అతని టైమింగ్‌ ప్రేక్షకుల్ని నవ్వుల పువ్వులు పూయించాయి.ఒక ముక్కలో చెప్పాలంటే సునీల్‌ ఉన్నంత కాలం అభిమానులు బ్రహ్మానందాన్ని కూడా మర్చిపోయారంటే సునీల్‌ ఏ స్ధాయి కమీడియన్‌ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే సునీల్‌ ఇప్పుడు కమీడియన్‌ గా మానేసి హీరోగానే చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఇక మీదట కామెడీ రోల్స్ చెయ్యనని తేల్చి చెప్పిన సునీల్ , తన అభిమాన నటుడు చిరంజీవి కోసం సునీల్ మళ్ళి కమెడియన్ పాత్ర చెయ్యడానికి ఒకే అన్నాడట . సునీల్ కు చిరంజీవి అనే ఎనలేని అభిమానం , అలాగే చిరంజీవికి కుడా సునీల్ అన్నా , సునీల్ కామెడీ అన్నా చాలా ఇష్టం. అందుకే తన 150 సినిమాలో ఒక పాత్రను చెయ్యమని చిరంజీవి అడగగానే సునిల్ వెంటనే ఒప్పేసుకున్నాడట . కట్టి సినిమాలో రెండో హీరో ఒక దొంగా , అతడితో పాటు స్నేహితుడు కుడా ఉంటాడు. హీరో ను ఎలివేట్ చేసే క్యారెక్టర్ , పైగా సినిమాలో ఒక ముఖ్య పాత్ర కావడంతో సునీల్ ఆ క్యారెక్టర్ చెయ్యడానికి ఒప్పుకున్నాడట. చిరంజీవి 150 వ సినిమాతో అయినా సునీల్ కామెడీ ను మరోసారి చూసే అవకాశం కలుగబోతోందని అభ్మానులు సంబర పడుతున్నారు.

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

ధోని పై టాలీవుడ్‌ అభినందనల జల్లు

హోలీ పండుగ వెనుక ఆసక్తికరమైన కధలు

కిలోల కొవ్వు కరిగించిన సెలబ్రిటీలు వీరే

రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్న మోహన్ బాబు

English summary

Comedian Who Became hero Sunil was going to acts as a Comedian in MegaStar Chiiranjeevi's 150 th film.Sunilaccepted this role beacuse of Chiranjeevi.