ఇంతకీ 'కన్నప్ప' ఏమైనట్టు?

Sunil To Act In Kannappa Movie

09:55 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Sunil To Act In Kannappa Movie

కొన్ని సినిమాలకు హైప్ క్రియేట్ అయ్యాక ఎందుకో ముందుకి రావు. అదే కోవలో ఇప్పుడు ‘కన్నప్ప’ కనిపిస్తోంది. ‘మిథునం’తో దర్శకుడిగా తనదైన శైలి చూపించి , మెప్పించిన రచయిత,నటుడు తనికెళ్లభరణి. ఆ తరవాత మళ్లీ ఆ చాయలకు వెళ్ళలేదు. అయితే ఈలోగా ‘కన్నప్ప’ అనే స్క్రిప్టు సిద్ధం చేసుకొన్న ట్లు వార్తలు వచ్చాయి. అది నటుడు సునీల్‌ కోసమేనని వినిపించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మంచు విష్ణు చేతుల్లోకి వెళ్ళడం, రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కిస్తామని విష్ణు కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ‘కన్నప్ప’ పాత్ర కోసం తనని తాను సిద్ధం చేసుకొంటున్న ట్లు కూడా విష్ణు చెప్పినట్లు వార్తలొచ్చాయి. తీరా ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏప్రిల్‌లో సెట్స్ మీదికి వెళ్ళాల్సిన ‘కన్నప్ప’ కు బ్రేక్ పడడానికి కారణం ఏమిటో తెలియరావడం లేదు. ఒక వేళ ఈ ప్రాజెక్టు మళ్లీ సునీల్‌ దగ్గరకు చేరిందా? విష్ణు స్థానంలో మరో కథానాయకుడు ‘కన్నప్ప’ అవతారం ఎత్తుతాడా ? లేకుంటే టోటల్ గా 'కన్నప్ప' అట కెక్కినట్టా అనేది తేలాల్సి వుంది.

English summary

Tollywood Senior Actor Tanikela Bharani was going to direct a movie named "Kannappa" movie.Previously this movie was decided to make with hero Manchu Vishnu but with some problems that movie was stopped and now a news came to know that actor Sunil to act instead of Manchu Vishnu