తొలిసారి కెమెరా ముందు నటిస్తున్న సునీత!

Sunitha acting in short film

04:02 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Sunitha acting in short film

విలక్షణమైన సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా పాపులారిటీ తెచ్చుకున్న సింగర్ సునీత తన సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. స్వదేశం, విదేశాల్లో వందలాది ఈవెంట్స్ లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక గతంలో కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చినా సరే, వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక లేటెస్ట్ గా సునీత ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు రాబోతోంది. రోలింగ్ రీల్ ఎంటర్ టైన్మెంట్- రేణుక టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్నాయి. ఇందులో సునీత నటిస్తోంది.. ఆమె రోల్ ఏంటన్నది తెలియాల్సివుంది.

ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు గురువారం మొదలయ్యాయి. దీనికి చైతన్య శ్రీ పెరంబుదూర్ డైరెక్టర్. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'అనామిక' మూవీ ప్రమోషన్ కోసం స్పెషల్ గా రెడీ చేసిన వీడియోలో సునీత నటించిన విషయం తెల్సిందే కదా. ఇక ఈ మూవీలో ఎలాంటి వేషం కట్టబోతోందో?

ఇది కూడా చదవండి: ఇల్లు ఖాళీ చేయించడానికి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు(వీడియో)

ఇది కూడా చదవండి: తాను చనిపోతూ 10 మంది ప్రాణాలు కాపాడిన 'బొబ్బా స్నేహామృత'

ఇది కూడా చదవండి: 'జ్యో అచ్యుతానంద' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Sunitha acting in short film. Singer Sunitha acting in a short film for the first time.