ఉదయభాను వ్యాఖ్యలపై సునీత రియాక్షన్

Sunitha reacts on Udaya Bhanu comments

11:15 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Sunitha reacts on Udaya Bhanu comments

ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అప్పడు పెద్దగా అర్ధం కాకపోయినా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఆ గొడవ యాంకర్ ఉదయభాను- సింగర్ సునీతల మధ్య నడిచిందని తేలింది. వీరిద్దరి మధ్యా అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. అమెరికా టూర్ లో ఓ సింగర్ తనను అవమానించిందని, కనీసం స్టేజ్ మీదకు కూడా ఇన్వైట్ చేయలేదని, స్టేజ్ మీదకి వెళ్లిన సమయంలో విషాద సంగీతాన్ని వినిపించారని ఆ అవమానానికి తట్టుకోలేక ఒకానొక సందర్భంలో ఏడుపు కూడా వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఉదయభాను. ఆ సింగర్ ఎవరనేది పేరు మాత్రం డైరెక్ట్ గా చెప్పలేదు. ఈ యవ్వారంపై సునీత ఇప్పుడు స్పందించింది.

నిజానికి తనను ఆమె అపార్థం చేసుకుందని, ఈ ప్రోగ్రాంకి రావాలని తానేమీ ఉదయభానుని పిలవలేదని వెల్లడించింది. ఆర్గనైజర్లు ఆమెని పిలిచారని, అలాంటప్పుడు తానెందుకు స్టేజ్ పైకి పిలుస్తానని అంటోంది. ఆమె స్టేజ్ మీదకు వస్తున్నప్పుడు తన టీమ్ విషాదంతో కూడిన మ్యూజిక్ ప్లే చేసిన విషయం తనకు గుర్తు లేదని చెప్పుకొచ్చింది సునీత. ఈ కార్యక్రమం తర్వాత చాలా సందర్భాల్లో ఉదయభాను దగ్గరకి వెళ్లి తాను పలకరించేదాన్ని.. కానీ, ఆమె తనతో మాట్లాడేది కాదని తెలిపింది. మొన్న ఉదయభాను ఇంటర్వ్యూ చూసిన తర్వాతే ఆమె కోపానికి అసలు కారణం తెలిసిందని అంటోంది. సో.. సునీత క్లారిటీతో ఇద్దరి మధ్య ఈ వివాదం కాస్తా ముగిసిపోయినట్టేనని అభిమానులు చెబుతున్నమాట! సో... అపార్ధాలు ప్రమాదమేనని మరోసారి రుజువైందని కొందరు నెటిజన్లు అంటుంటే, ఎదో ఇప్పుడు కవర్ చేసుకున్నట్లు ఉందని మరికొందరి వాదన. మొత్తానికి ఈ యవ్వారం ఇక్కడితో సర్దుమణిగినట్టేనా?

English summary

Sunitha reacts on Udaya Bhanu comments