హాట్ సన్నీ కోసం వెతుకులాటలో సరికొత్త రికార్డు

Sunny Leone As Most Google Searched Actress In India From Last 10 Years

11:23 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Sunny Leone As Most Google Searched Actress In India From Last 10 Years

సన్నీలియోన్ గురించి చెబితే, చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలా హాట్ హాట్ గా కనిపిస్తూ నటించిన సినిమాలు కొన్నే అయినా భారీ సంఖ్యలోనే అభిమానులను సంపాదించుకుంది. అలా సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అపారాభిమానాన్ని దక్కించుకుంది. ఈ భామ ఏ పని చేసినా అందులో వెరైటీ ఉంటుంది. అంతేకాదు ఆమె చేసే వెరైటీని జనం వెతుకుతారు కూడా .

ఈ నేపథ్యంలో సన్నీ మరో రికార్డు సాధించింది. గత పదేళ్లలో ఎవరూ దక్కించుకోలేని రికార్డు సన్నీ సొంతం చేసుకుంది. గడిచిన పది సంవత్సరాల్లో మనదేశంలో ఎక్కువ మంది సెక్సీ సన్నీ గురించే గూగుల్ లో సెర్చ్ చేశారు..ఇలా భారీ సంఖ్యలో వెతకడంతో హాట్ భామకు మొదటి స్థానం దక్కింది. ఈ విషయాన్ని గూగుల్ స్వతహాగా మీడియాకు ఫ్రెస్ రిలీజ్ రూపంలో తెలిపింది. దీంతో మరోసారి సన్నీ రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈమె హాట్ వీడియోల కోసం తెగ ఎగబడి చూశారని టాక్ నడుస్తోంది.

ఇండియన్ సినీనటీ, నటీమణులు,సింగర్, డ్యాన్సర్, డైరక్టర్, సినిమాల కోసం గత పదేళ్లుగా నెటిజన్లు ఎవరెవరు ఏ యాక్టర్ కోసం వెతికారన్న విషయాలనూ గూగుల్ బయటపెట్టింది.

ఇక సన్నీ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. హీరోల పరంగా చూస్తే సల్మాన్ మొదటి స్థానం, షారుక్ రెండో స్థానం, అక్షయ్ కుమార్ మూడో స్థానంలో, బిగ్ బీ అమితాబ్ నాల్గో స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సెక్సీ సన్నీ తరువాత కత్రినా, కరీనా కపూర్, దీపికా పదుకుణే, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, తమన్నా బాటియా, అలియా భట్ ఉన్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే పీకే, బాహుబలి టాప్ లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి:జర్నలిస్ట్ క్వశ్చన్ కి ఊగిపోయిన సానియా

ఇవి కూడా చదవండి:30 ప్లస్ లో కూడా హాట్ నెస్ గుప్పిస్తున్న నయన

English summary

Bollywood Actress Sunny Leone has created Record as She was the most Google Searched Celebrity for last Ten Years. Salman Khan Stood In Second Position After Sunny Leone.