బాలయ్య వందో సినిమా లో 'విషకన్య' గా సన్నీ

Sunny Leone in Balakrishna 100th film

11:37 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Sunny Leone in Balakrishna 100th film

'డిక్టేటర్' చిత్రం విజయం తరువాత నందమూరి నటసింహ బాలకృష్ణ వందో చిత్రం ఎవరి దర్శకత్వంలో నటించబోతాడో అన్న చర్చలు కొనసాగాయి. ఆ తరువాత దానికి ఫుల్ స్టాప్ పెడుతూ తన వందో సినిమా గురించి బాలయ్య ప్రకటించాడు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడని, అందులో నేను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాత్రలో నటించబోతున్నాని బాలయ్య ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘యోధుడు’ గా ప్రకటించారు, ఇదిలా ఉంటే ఇందులో ‘విషకన్య’గా బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ నటించనుందని షాకింగ్ న్యూస్ వచ్చింది.

శాతవాహనరాజు అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని తన అందాలతో రెచ్చగొట్టే విధంగా ఓ స్పెషల్ హాట్ సాంగ్ కోసం సన్నీ లియోన్ ని ఎంపిక చేశారట. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రోల్ కోసం బాలయ్య అప్పుడే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాల శిక్షణ లో నైపుణ్యం పొందుతున్నాడు. అంతే కాదు కాస్త స్లిమ్‌గా కూడా తయారవుతున్నాడు. ఈ చిత్రం డైరెక్టర్ క్రిష్ సన్నీ లియోన్ కోసం ప్రత్యేకంగా 'విషకన్య' ఐటం సాంగ్ ను దగ్గరుండి రాయిస్తున్నాడట. ఇంక రానా కూడా రానా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

English summary

Sunny Leone in Balakrishna 100th film. Bollywood sex bomb Sunny Leone is acting as a Visha Kanya in Balakrishna 100th movie.