సన్ని లియోన్‌ కి ఉన్న బుద్ది అగ్ర హీరోలకి లేకుండా పోయింది

Sunny Leone Is Morally Good

03:07 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Sunny Leone Is Morally Good

సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత ఉండాలా ? అని అడిగితే కచ్చితంగా ఉండాలి అనే అంటాం. ఎందుకంటే సెలబ్రిటీలను ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. వారు ఏం చేస్తే అది చేసే అభిమానులు మన దేశంలో తక్కువేమి కాదు. అందుకే వాళ్ళు ఏదైనా చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి అనిపిస్తేనే చేయాలి లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

ఇటీవల సన్నీలియోన్‌ సమాజానికి హాని కల్గించే ఎటువంటి ఉత్పత్తిని నేను ప్రమోట్‌ చేయనని ప్రకటించింది. ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. గుట్కా ప్రకటనల్లో నటించవద్దని ఢిల్లీ గవర్నమెంట్‌ అడిగిన వెంటనే సన్నీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ఇదే గవర్నమెంట్‌ బాలీవుడ్‌ హీరోలైన షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, గోవిందా, అర్బాజ్‌ ఖాన్‌లను ఇలాంటి ప్రొడెక్ట్స్‌ని ప్రమోట్‌ చేయకండి అని అడిగితే ఎలాంటి సమాధానం ఇంకా రాలేదు. చివరికి కేజ్రివాల్‌ ప్రభుత్వం హీరోల భార్యలకు సైతం లేఖలు పంపింది. వారం దాటినా ఫలితం ఏమీలేదు.

సన్నీ లియోన్‌ లాగా ఆలోచించి బాధ్యతగా నిర్ణయం తీసుకోవాల్సింది పోయి అసలు పట్టించుకోవడం లేదు ఆ హీరోలు. సన్నీ లియోన్‌ అలాంటి ప్రకటనల ద్వారా తనకొచ్చే డబ్బులను సైతం వదిలేసుకుని ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఆమెకు జై కొట్టాల్సిందే. ఆమెకు ఉన్న బుద్ది హీరోలకు లేదని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

English summary

kejriwal government thus took the initiative to mail actors such as Shahrukh khan, Govinda, Ajay Devgn, Govinda, Arbaaz Khan and Sunny Leone explaining the harmful effects of some of the products they endorse.