రేటు అడిగినందుకు రిపోర్టర్ చెంప పగలగొట్టింది

Sunny Leone slaps reporter for asking stupid question

04:48 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Sunny Leone slaps reporter for asking stupid question

ఒకప్పుడు కెనడా పోర్న్‌స్టార్‌గా వెలుగొందిన సన్నీలీయోన్ ఆ తరువాత పోర్న్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసింది. 'జిస్మ్‌ -2' బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ బ్యూటీ ఆ తరువాత 'రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. అయితే ఈ అమ్మడు తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొంది. తెల్లటి డ్రెస్‌లో సాంప్రదాయంగా కనువిందు చేసిన సన్నీ అక్కడ అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. తనని చూడడానికి వచ్చిన వారిని ఉద్ధేశించి మైక్‌లో మాట్లాడింది. ఆ తరువాత మైక్‌ను పక్కన పెట్టేసి అక్కడ వస్తున్న మ్యూజిక్‌ కు స్టెప్పులు వేసింది. సన్నీతో పాటు అక్కడున్న వాళ్లందరూ కాళ్లు కదిపారు.

ఆ తరువాత ఒకరి పై ఒకరు రంగులు జల్లుకున్నారు. అయితే అంతకుముందు 'ప్లే హోలీ విత్‌ సన్నీ లియోన్‌' అనే కార్యక్రమానికి వచ్చిన సన్నీలియోన్‌ సూరత్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తన భర్తతో బస చేసింది. అయితే అక్కడకి ఓ న్యాషనల్‌ న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌ సన్నీలియోన్‌ ను ఇంటర్‌వ్యూ చెయ్యడానికి వచ్చాడు. ఇంటర్‌వ్యూలో భాగంగా ఆ రిపోర్టర్‌ సన్నీని కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత ఒకప్పుడు మీరు పోర్న్‌స్టార్‌ ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటున్నారు? అని అడిగాడు. ఈ ప్రశ్నకి సన్నీలియోన్‌కి ఆగ్రహం వచ్చినా, మళ్లీ ఒకసారి ఆ క్వశ్చన్‌ని రిపీట్‌ చెయ్యి అని రిపోర్టర్‌ ని అడిగింది.

ఆ రిపోర్టర్‌ ఆ ప్రశ్నని మళ్లీ రిపీట్‌ చేస్తూ ఓ రాత్రి ప్రోగ్రామ్‌కు మీరెంత డబ్బులు తీసుకుంటారు అని అడగగా... వెంటనే సన్నీలియోన్‌ ఆ రిపోర్టర్‌ చెంప ఛెళ్లుమనిపించింది. ఈ సంఘటనను చూసిన అక్కడ హోటల్‌ సిబ్బంది మరియు విజిటర్లు అవాక్కయ్యారు. ఈ సంఘటన పై సన్నీ భర్త స్పందిస్తూ.... ఆ రిపోర్టర్‌కి సన్నీ సరైన గుణపాఠం చెప్పింది. కాబట్టి ఇంక పోలీసులకి ఫిర్యాదు చెయ్యవలసిన అవసరం లేదు. పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కాలేజి స్టూడెంట్స్‌ కాబట్టి వాళ్ల భవిష్యత్తుని నాశనం చెయ్యదలచుకోలేదు. అయితే ఇక పై గుజరాత్‌ రావడానికి 1000 సార్లు ఆలోచిస్తాం అని చెప్పారు.

English summary

Bollywood hot beauty Sunny Leone slaps reporter for asking stupid question. A reporter asked Sunny Leone that how much you charge for one night.