సన్నీ..మోడిని మించిపోయింది!!

Sunny Leone top place in google search

12:51 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Sunny Leone top place in google search

పంజాబీ కుటుంబంలో పుట్టి కెనడాలో పెరిగి అక్కడ పోర్న్ స్టార్గా రాజ్యమేలిన సన్నీలియోన్‌, పోర్న్‌ ఫిలింస్‌కి గుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌ లో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. తను నటించిన మొదటి చిత్రం జిస్మ్‌ -2 ఫ్లాప్‌ అయినా ఇందులో తన నటనతోనూ, అందాల ఆరబోతతోనూ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు గుండెల్లో గుబులు తెప్పించి తన అందంతో పిచ్చెక్కించింది. ఆ తరువాత తన నటించిన హారర్‌ చిత్రం రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 తో ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది. ముఖ్యంగా ఇందులో 'బేబిడోల్‌' పాటతో అందరికీ పాపులర్‌ అయిపోయింది.

ఆ తరువాత వచ్చిన 'ఏక్ పహేలీ లీలా' చిత్రంలో కూడా తన అందాలు పరిచి కుర్రకారు మతులు పోగొట్టింది. ఇప్పుడు 'మస్తీజాదే' చిత్రంలో తుషార్‌ కపూర్‌ సరసన సన్నీలియోన్‌ నటించింది. జనవరి 29న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలయింది. 'గ్రాండ్‌ మస్తీ' కంటే పూర్తి అడల్ట్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌లో సన్నీలియోన్‌ హాట్‌ హాట్‌ గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఏకంగా 27 సార్లు బికినీలు వేసుకుని అందరికీ అందాలు పంచనుంది. ఈ టీజర్‌ రిలీజైన అయిన తరువాత సన్నీ లియోన్‌ పేరు గూగుల్‌ లో మారు మ్రోగుపోతుంది.

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో సన్నీలియోన్‌ పేరు దేశ వ్యాప్తంగా నిలిచి ప్రధాని నరేంద్ర మోడీని మించిపోయి నెం.1 స్ధానంలో నిలిచింది.


English summary

Sunny Leone top place in google search. Sunny Leone latest movie is MastiZaade. It is full adult content movie releasing on January 29th.