ఆ కోరిక  తీరలేదు ...

Sunny Leone Wants Kids

10:51 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Sunny Leone Wants Kids

ఇప్పటి వరకు హిందీ, తమిళ, కన్నడలతో కలిపి పదిహేను చిత్రాల్లో నటించిన ఈ బాలివుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు పిల్లల్ని కనే కార్యక్రమం దృష్టి పెడతానంటోంది. ‘కరెంట్‌ తీగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సన్నీ, ఇప్పటివరకూ ‘జాక్‌పాట్‌’, ‘రాగిని ఎంఎంఎస్‌ 2’, ‘ఏక్‌ పహేలి లీలా’లతో పాటు ఇటీవల ‘మస్తీజాదా’ వరకు బాలీవుడ్‌ చిత్రాలను చేసింది. ఈ మధ్య కాలంలో ఈమె, ఈమె భర్త బిజీ బిజీ అయిపోవడం, పని ఒత్తిళ్లలో పడిపో వడంతో ఇన్నాళ్ళూ, పిల్లల గురించే ఆలోచించలేదట. ‘మీ ఇద్దరికీ వయసు వచ్చేస్తోంది. పిల్లల్ని ఇంకెప్పుడు కంటారు?’ అంటూ మా అత్తగారు ఒకటే హడావిడి పెట్టేస్తున్నారట. అందుకే ఇటీవలే పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారట. అత్తగారి ఒత్తిడి తట్టుకోలేక సన్నీ దంపతులిద్దరు పిల్లలు కావాలనుకుంటున్నారు మరి. అత్తయ్య చేతిలో బిడ్డను పెట్టాలన్నది నా కోరిక అంటోంది సన్నీ ... ఇక తెలుగులో చేయడం మరపురానిదని చెబుతున్న సన్నీ, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు దగ్గరల్లోని రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తినాలను కుందట. అయితే అది కుదరకపోవడంతో ఆ కోరిక తీరలేదు. మరి తెలుగు నటుడు మోహన్‌బాబుతో నటించాలని వుందని చెప్పే సన్నీ త్వరలోనే హైదరాబాద్ బిర్యాని కూడా రుచి చూసేస్తే, ఆ కోరికా తీరిపోతుంది.

English summary