అది మాత్రం నా భర్తతో కుదరదు : సన్నీ

Sunny Leone won't act with her husband

11:19 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Sunny Leone won't act with her husband

భర్తతో కాకపోతే ఎవరితో చేస్తుందట అంటూ కామెంట్స్ పడిపోతాయి మరి. అలావుంది ఈ యవ్వారం. అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకుంటే పోతుందికదా. నిన్నటి పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లలో, ముఖ్య పాత్రల్లో కూడా వరుస చిత్రాల్లో నటించి, మెప్పిస్తూ, యమ బిజీగా ఉంది. తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోన్న ఈ అమ్మడు తన భర్తతో మాత్రం నటించేందుకు సిద్ధంగా లేదట. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఒక నిర్మాత భారీ బడ్జెట్ తో సన్నీలియోన్, ఆమె భర్తతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు.

అందుకు కథను కూడా సిద్ధం చేయించాడు. కానీ సన్నీ మాత్రం రివర్స్ గేర్ లో ఉందట. తన భర్తతో నిజ జీవితంలో రొమాన్స్ చేస్తున్న నేను కెమెరా ముందు కూడా రొమాన్స్ చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో చేసి, ఇక కెమెరా ముందు కూడా రొమాన్స్ చేయడం అంటే చాలా బోర్ విషయం అంటూ సన్నీలియోన్ తేల్చి చెప్పింది. బోరింగ్ వల్లే తాను తన భర్తతో కలిసి నటించాలని అనుకోవడం లేదంటూ సన్నీలియోన్ చెప్పేసింది. ప్రస్తుతం సన్నీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో మరోసారి సౌత్ లో కూడా ఈమె తన హాట్ అందాలను చూపే అవకాశం ఉంది.

English summary

Sunny Leone won't act with her husband