సూపర్ కండోమ్ వచ్చేసింది..

Super Condom Released

06:56 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Super Condom Released

ఎయిడ్స్ ను నియంత్రించేందుకు ఇండో అమెరికన్ పరిశోధకులు ఓ సూపర్ కండోమ్‌కు రూపకల్పన చేశారు. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే ఈ కండోమ్ కు.. పొరపాటున చిరిగిపోయినా ఆ తర్వాత కూడా వైరస్‌ను చంపగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన మహువా చౌదరి, ఆమె బృందం కలిసి ఈ హైడ్రోజెల్ కండోమ్‌ను రూపొందించారు. ఇందులో ప్రధానంగా హైడ్రోజెల్ అనే ఎలాస్టిక్ పాలిమర్ ఉంటుంది. హెచ్ఐవీ నిరోధక సామర్థ్యం కలిగిన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇది కేవలం హెచ్ఐవీ ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడం మాత్రమే కాక వీలైతే పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్‌ను నాశనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని మహువా తెలిపారు. ఈ సూపర్ కండోమ్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్‌పై పోరాటంతో పాటు అవాంఛిత గర్భాన్ని, సుఖవ్యాధులను నిరోధిస్తుందని, తమ ప్రయోగాలు విజయవంతం అయితే.. హెచ్ఐవీ నిరోధక కృషిలో ఇది మైలురాయి అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ చదివి, తర్వాత అమెరికాలో పీహెచ్‌డీ చేసిన మహువా చౌదరి ప్రస్తుతం మధుమేహం, ఊబకాయాల మీద పరిశోధన చేస్తున్నారు. 1981లో హెచ్ఐవీ బయట పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాని కారణంగా 3.9 కోట్ల మంది మరణించారు.

English summary

Super Condom Released ,researchers including an Indian-American professor have developed a new non-latex condom which contains antioxidants and can kill the deadly virus even after breaking